కేరళలోని త్రిసూర్ జిల్లాలోని మట్టత్తూర్ పంచాయితీలో ఆదివారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ కేరళలో బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ సులభతరం చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సంస్థాగత క్షీణత బీజేపీ కి మార్గంగా మారిందని అన్నారు. మట్టత్తూర్‌లో ఎనిమిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీతో చేతులు కలిపారని అన్నారు. అధ్యక్ష పదవికోసం స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చారని, స్థానిక సంస్థల్లో ఎల్‌డిఎఫ్‌కి అధికారం లేకుండా చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖర్చుతో బీజేపీ అత్యధికంగా లాభపడిందని పేర్కొన్నారు. "మట్టనూర్ మోడల్" లౌకిక, ప్రగతిశీల కేరళకు కొత్తదని అన్నారు. అరుచణా ప్రదేశ్‌లో ఇదే ప్రహసనం కొనసాగిందని, ముఖ్యమంత్రితో సహా 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 43 మందిపార్టీని వీడి బీజేపీలో చేరారని విజయన్ పేర్కొన్నారు. 2019లో గోవాలో, ఆ తర్వాత 2021లో పుదుచ్చేరిలో మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ మోడల్‌ను పునరావృతం చేసిందని, 2019లో గోవాలో కాంగ్రెస్ పార్టీ బిజెపిలో పూర్తిగా విలీనమైందని అన్నారు. పుదుచ్చేరిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ బేరసారాలు నిర్వహించిందని, కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కేరళలో ఈ నమూనాను పునరావృతం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని, మట్టనూర్ కేవలం నమూనా మాత్రమేనని అన్నారు. గ్రామ పంచాయితీలో ఎల్‌డిఎఫ్ పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ బీజేపీతో జత కట్టింది. ఒక్కదెబ్బకి కేరళలో కాంగ్రెస్ బీజేపీకి లంగిపోయేలా చేసిందని అన్నారు. మట్టనూర్ కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు.ఎన్నుకోబడిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ లోకి ఫిరాయించడం త్వరలో ఒక ప్రవాహంలా మారుతుందని సూచించారు. కాంగ్రెస్‌కు వేసిన బీజేపీకి వేసిన ఓటుగా స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ను కొనుగోలు చేయగల వస్తువుగా బీజేపీ భావిస్తోందని అన్నారు. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆర్‌ఎస్‌ఎస్‌లోకి చేర్చుకోవడం ద్వారా ప్రజల తీర్పుని దెబ్బతీయవచ్చని బీజేపీ చూస్తోందని హెచ్చరించారు.
0 Comments