Ad Code

రియల్‌మీ నుంచి 10,001mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ ?


రియల్‌మీ కంపెనీ 10,000mAh భారీ బ్యాటరీతో కూడిన ఒక స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అది కేవలం కాన్సెప్ట్ డివైస్ మాత్రమే కాగా, వినియోగదారులకు విక్రయాల కోసం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు తాజాగా రియల్‌ మీ మరింత పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, టెలిగ్రామ్ వేదికగా లీక్ అయిన సమాచారం ప్రకారం ఓ మిస్టరీ రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 10,001mAh బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్‌కు RMX5107 అనే మోడల్ నంబర్ ఉంది. ఇది ఇప్పటి వరకు రియల్‌ మీ నుంచి వచ్చిన అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'అబౌట్ డివైస్' వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌ మీ UI 7.0పై వర్క్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన రియల్‌ మీ తాజా ఆపరేటింగ్ సిస్టమ్. గత నెలలోనే ఈ UIని కంపెనీ అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. ఈ ఫోన్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు తెలుస్తుంది. అదనంగా వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇటీవల హానర్ కంపెనీ చైనాలో త్వరలో విడుదల చేయనున్న Honor Power 2 స్మార్ట్‌ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ ఉంటుందని ప్రకటించింది. అయితే, తాజా లీక్స్ ప్రకారం, రియల్‌ మీ ఈ విషయంలో హానర్‌ను కూడా మించనుంది. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వస్తే, బ్యాటరీ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఛాన్స్ ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu