రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న ప్రయాణీకులకు రాయితీ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ మోడల్‌లో రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు టికెట్లను కొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఆఫర్ జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రైల్‌వన్ యాప్‌లో ఆర్-వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్‌బ్యాక్ యథాతథం గా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్‌రిజర్వుడు టికెట్‌లకు ఈ ఆఫర్ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను ఏ డిజిటల్ పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్) ద్వారా కొనుగోలు చేసినా ఈ 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రైలు టికెట్, ప్లాట్‌ఫామ్ టికెట్, ట్రైన్‌లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్క చోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే 'రైల్‌వన్ యాప్'ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేయడంతో పాటు లైవ్ ట్రైన్ స్టేటస్, ప్లాట్ ఫామ్ వివరాలు, ఆహార ఆర్డర్లు కూడా చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి మరియు సామాన్యులను డిజిటల్ బాట పట్టించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.
రైల్‌వన్ యాప్‌లో టికెట్లనుకొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్ !
by Telugu Lo Computer at December 31, 2025
Labels:
3% Discount on Tickets Purchased Through RailOne App
,
national
,
special offer will be available from January 14 to July 14
,
technology
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment