కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.
టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ వీరంగం : గేటు ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి !
by Telugu Lo Computer at December 30, 2025
Labels:
Brahmara Kootlu toll plaza near Bantwal in Dakshina Kannada district
,
Driver's rampage at toll plaza
,
Gate vandalized and staff attacked
,
karnataka
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment