ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన 9 మంది స్మగ్లర్లు గంజాయిని లగేజ్ బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలించే యత్నం చేశారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లగేజ్ బ్యాగుల్లో దాచిన భారీ మొత్తంలో విదేశీ గంజాయి బయటపడింది. వెంటనే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్పై దర్యాప్తు చేపట్టారు.
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
by Telugu Lo Computer at December 31, 2025
Labels:
Criem
,
customs officials seized 40 kgs
,
Ganja worth Rs. 40 crore seized at Mumbai International Airport
,
national
,
Nine smugglers from Bangkok
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment