బుల్లితెర నటి నందిని బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. షూటింగ్ ని రీసెంట్‌గా చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్‌కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్ నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments