ఒక మహిళ తాను పనిచేయని కంపెనీ నుంచి తొలగింపు మెయిల్ పొందింది. సైమన్ ఇంగరి అనే ఎక్స్ యూజర్.. ''నా భార్య ఎప్పుడూ పని చేయని కంపెనీలో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఒక మెయిల్ పొందిందని వెల్లడించారు''. ఈ మెయిల్ చూసిన నా భార్య ఒక్కసారిగా షాకైంది. వచ్చిన మెయిల్.. తాను పనిచేయని కంపెనీ అని తెలుసుకునే లోపే భయానికి గురైందని అన్నారు. అంతే కాకుండా ఎవరికైనా ఇలాంటి సందేశాలను పంపే ముందు మెయిల్ ఐడీ జాగ్రత్తగా గమనించాలని హెచ్‌ఆర్‌కు చెబుతూ.. ఇలాంటి తప్పుడు మెయిల్స్ వల్ల ఎవరికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సూచించారు. సైమన్ ఇంగరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ కంపెనీపై విమర్శలు కురిపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో పెరుగుతున్న నిర్లక్ష్యం & ఉద్యోగ అభద్రతకు ఇదొక ఉదాహరణ అని చెబుతున్నారు. ఇది చిన్న తప్పు కాదు. ఒక ఉద్యోగి మానసిక స్థితిని దెబ్బతీస్తుందని అన్నారు.
0 Comments