Ad Code

ప్రపంచంలో అధిక వేతనం పొందుతున్న క్వాంటమ్‌ స్కేప్ కంపెనీ సీఈఓ జగ్దీప్ సింగ్ !


క్వాంటమ్‌ స్కేప్ కంపెనీ సీఈఓ జగ్దీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగిగా తెచ్చుకున్నారు. ఈయన ఆదాయం రోజు రూ.48 కోట్ల చొప్పున జగ్దీప్‌సింగ్‌ వార్షికాదాయం ఏకంగా సుమారు రూ.17,500 కోట్లు. జగ్దీప్ సింగ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. బెర్క్‌లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీటెక్‌లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలు, ఎంబీఏలో నేర్చుకున్న వ్యాపార మెలకువలు తాను ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఆయన క్వాంటమ్ స్కేప్‌ను స్థాపించడానికి ముందు పదేళ్లకు పైగా వివిధ కంపెనీల్లో పనిచేశారు. బ్యాటరీ టెక్నాలజీలో వస్తోన్న విప్లవాత్మక పురోగతిని అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు. ఈ అనుభవంతో 2010లో క్వాంటమ్‌స్కేప్‌ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిలుస్తోంది. క్వాంటమ్ స్కేప్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఘనస్థితి (సాలిడ్‌ స్టేట్‌) బ్యాటరీలను అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి అధిక శక్తిని, వేగవంతమైన ఛార్జింగ్ సమయాన్ని, మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ కంపెనీ టెక్నాలజీ ముందంజలో ఉంది. బిల్ గేట్స్, వోక్స్ వ్యాగన్‌ వంటి దిగ్గజాలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ స్పేస్‌లో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu