ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా సౌతాఫ్రికా(112) రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా 109 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. 9 ఏళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. చివరిగా 2016లో ఈ స్థానంలో నిలిచింది. భారత్‌పై ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం ఆసీస్‌కు కలిసి రాగా.. పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత్‌ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే సౌతాఫ్రికా, ఆసీస్ డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్(106), న్యూజిలాండ్(96), శ్రీలంక(87), పాకిస్థాన్(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్(65), ఐర్లాండ్(26) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
0 Comments