ఫార్ములా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ పక్కా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని అన్నారు. అబద్దాలు తనను దెబ్బతీయలేవన్నారు. కుట్రలతో తన నోరు మూయించలేరని.. ఇవాల్టి అడ్డంకులే రేపటి విజయానికి సోపానాలు అని ట్వీట్ చేశారు కేటీఆర్. న్యాయం కోసం పోరాటం సాగిస్తామని.. త్వరలోనే ప్రపంచానికి వాస్తవాలు తెలుస్తాయని మాజీ మంత్రి అన్నారు. ''నా పునరాగమనం ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటోంది. అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నీ మాటలు నన్ను తగ్గించవు. మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచవు. కోపోద్రిక్తత నన్ను నిశ్శబ్దం చేయదు! నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది! నాకు మన న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది, త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుంది'' అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
0 Comments