Ad Code

సీఎంఆర్‌ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్టు !


మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. బీహార్‌కు చెందిన నంద కిశోర్‌, గోవింద్‌ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్‌ కాలేజీ చైర్మన్‌ చామకూర గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌ల్లో తొంగిచూసినట్లు గుర్తించారు. దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూమ్‌ల్లో కిశోర్‌, గోవింద్‌ ఈ నీచ పనికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కిశోర్‌, గోవింద్‌తోపాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. కాలేజీ డైరెక్టర్‌ మాదిరెడ్డి జంగారెడ్డి, ప్రిన్సిపల్‌ అనంతనారాయణ, వార్డెన్‌ ప్రీతిరెడ్డి, క్యాంపస్‌ వార్డెన్‌ ధనలక్ష్మిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినులను ఉద్దేశించి కిశోర్‌, గోవింద్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. విద్యార్థినుల ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకుండా వదిలిపెట్టింది. దీంతో.. విద్యార్థినుల ఆందోళనలను పట్టించుకోనందుకు వారిపై కేసులు నమోదు చేశారు. విద్యార్థినుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకు యాజమాన్యంపై కేసులు పెట్టారు.

Post a Comment

0 Comments

Close Menu