రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం లో 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సాగుకు యోగ్యమైన భూమి కి రైతు భరోసా ఇస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్ ముంచినా కూడా సరిదిద్దుకుంటూ పోతున్నామని వివరించారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూ రైతు భరోసా లో 12 వేలు వేయాలని నిర్ణయించామని ప్రకటించారు. భూమి లేని రైతుల గురించి ఎప్పుడైనా కేటీఆర్ ఆలోచన చేశారా ? భూమి లేని రైతుకు 12 వేలు మేము ఇస్తున్నామని ప్రకటన చేశారు. ఆర్థిక వెసులుబాటు తగ్గట్టు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ లకు కూడా కేటీఆర్ రైతు భరోసా ఇవ్వాలని అంటున్నాడని ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితిలో రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వబోమని, కేటీఆర్ కి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు.
0 Comments