Ad Code

వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం !


వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడంతో పాటు టోల్ వసూలును రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ అమలును తప్పనిసరి చేసింది. అయితే, ఇప్పటికీ కొందరు వెహికల్ ఓనర్స్ ఫాస్ట్ ట్యాగ్‌ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాలు ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉండాలని ప్రకటించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మహారాష్ట్రలోని అన్ని వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ మెయింటెన్ చేయాలి. రాష్ట్రంలో టోల్ వసూలును స్ట్రీమ్‌లైన్ చేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించాలన్న లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలు తేదీని కూడా ప్రకటించడంతో ఎలాంటి ప్రభావం ఉండనుందోనన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, ఫోర్ వీలర్ వెహికల్ ఓనర్లు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారనేది వేచిచూడాలి. రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పనితీరును మరింత ప్రభావవంతంగా మార్చాలన్న సంకల్పంతో 2014లో రూపొందించిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పాలసీకి సవరణలు చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పరిపాలన పారదర్శకంగా, సిటిజన్ సెంట్రిక్‌గా ఉండేలా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అప్డేట్స్‌లో రీఫార్మ్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu