Ad Code

కుంభ మేళాకు హ్యూమన్ మెటా న్యుమో వైరస్‌ ఎఫెక్ట్ ?


త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ నెల 13న మకర సంక్రాంతిని పురస్కరించుకుని మహా కుంభ మేళాను ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మహా కుంభ మేళాను యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంచి నీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఆకర్షించి, ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయించింది. కానీ, ఇంతలోనే చైనా నుంచి హ్యూమన్ మెటా న్యుమో వైరస్‌ (హెచ్ ఎంపీవీ) దేశంలోకి కూడా ప్రవేశించిం ది. ప్రస్తుతానికి ఈ వైరస్‌తో ప్రాణాపాయం లేకున్నా, తమ్ములు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, గొంతునొప్పి, జ్వరం లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారు పెరుగుతున్నారు. పైగా హెచ్ ఎంపీవీ అనేది అంటు వ్యాధి. సెకనుల వేగంతో ఇది వ్యాపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కంటికి కనిపించని శత్రువు మహా కుంభ మేళాపై ఏమేరకు ప్రభావం చూపుతుందనేది పెద్ద చిక్కుగా మారింది. అయితే మహా కుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి లేదు. కానీ, హెచ్ ఎంపీవీ వైరస్ కనుక తగ్గుముఖం పట్టకపోతే.. భక్తులను కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. సో.. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు చేసిన 7500 కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారనుంది. ఈ విషయంపైనే.. ఇప్పు డు కేంద్ర, యూపీ ప్రభుత్వాలు తర్జన భర్జన పడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu