ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ సంధు జగదీష్ ను తొలగించారు. పదేళ్లుగా తన వద్దే ఉంటున్న జగదీష్ చేసిన అక్రమాలన్నీ తెలిసీ కొంతకాలంగా భరిస్తూ వచ్చిన అనిత తాజాగా ఆయనకు చెక్ పెట్టారు. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పదేళ్ల క్రితం సంధు జగదీష్ అనే వ్యక్తిని పీఏగా నియమించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఓడినా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యాక కూడా అతనిని పీఏగా కొనసాగించారు. ఇదే అదనుగా సంధు జగదీష్ అనే వ్యక్తి అవినీతి ఆనకొండగా మారిపోయాడు. వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇలా జగదీష్ చేయని పని లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జగదీష్ దందాలు సాగాయి. పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యంలో షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, హోంమంత్రి కోటాలో వచ్చిన తిరుమల దర్శనం టికెట్లు తిరుపతిలో ఓ హోటల్ కు అమ్మేయడం ఇలా జగదీష్ చేయని పాపాలు లేవు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి పట్టించుకోకుండా అతన్ని కొనసాగించడంతో ఈ పాపాల్లో ఆమెకూ వాటా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అంతకు మించి ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీంతో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో జగదీష్ ను అనిత వదిలించుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ తొలగింపు !
by Telugu Lo Computer at January 04, 2025
Labels:
ఆంధ్రప్రదేశ్
,
పదేళ్ల క్రితం సంధు జగదీష్ అనే వ్యక్తిని పీఏగా నియమించుకున్నారు
,
పీఏ సంధు జగదీష్
,
బెదిరింపులు
,
వసూళ్లు
,
సెటిల్మెంట్లు
,
హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ తొలగింపు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment