ప్రపంచంలోనే వృద్ధురాలిగా పేరొందిన టోమికో ఇటూకా (116) కన్నుమూశారు. జపాన్‌కు చెందిన ఈమె, వృద్ధాప్య సమస్యలతో డిసెంబరు 29న మృతి చెందారని అధికారులు తెలిపారు. 1908 మే 23న ఒసాకోలో జన్మించిన ఇటూకా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం గత ఏడాది స్పెయిన్‌కు చెందిన బ్రన్యాస్ (117) మరణంతో ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా నిలిచారు. గతేడాది మేలో ఇటూకా తన జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఆమెను కలసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇటూకాకు అరటిపళ్లతో పాటు, అక్కడి ప్రత్యేకమైన 'కాల్పిస్' అనే శీతల పానీయము కూడా ఎంతో ఇష్టం. పాఠశాల విద్యార్థినిగా వాలీబాల్ ఆడేవారు. 3,067 మీటర్ల ఎత్తయిన ఆన్టేక్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించి రికార్డు సాధించారు. టోమికో ఇటూకా 20 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1979లో భర్త మరణించిన తర్వాత ఒంటరిగా 'నర' నగరంలో జీవించసాగారు. జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం, ఇటూకా మరణంతో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా 116 ఏళ్ల కెనబర్రో లుకాస్ నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన ఈమె, ఇటూకా కంటే 16 రోజులు చిన్నవారు.
ప్రపంచంలోనే వృద్ధురాలు టోమికో ఇటూకా కన్నుమూత !
by Telugu Lo Computer at January 04, 2025
Labels:
1908 మే 23న ఒసాకోలో జన్మించిన ఇటూకా
,
international
,
ప్రపంచంలోనే వృద్ధురాలు టోమికో ఇటూకా కన్నుమూత
,
వృద్ధాప్య సమస్యలతో డిసెంబరు 29న మృతి
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment