Ad Code

ఐటెల్ నుంచి A80 స్మార్ట్‌ఫోన్‌ ?

టెల్ A80 స్మార్ట్‌ఫోన్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మకంగా మారేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేటుతో, IP54 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, అద్భుతమైన విజువల్స్, స్పష్టమైన డిస్‌ప్లే నాణ్యత, మన్నికను అందిస్తుంది. A80 సిరీస్, ఈ బ్రాండ్‌కు పెద్ద సంచలనం తీసుకురావడమే కాక, వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని అందిస్తుంది. ఐటెల్ A80 6.67 అంగుళాల పెద్ద పంచ్-హోల్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది డైనమిక్ బార్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. 8GB RAM (4GB + 4GB*), 128GB ROM తో ఇది మల్టీటాస్కింగ్‌కి పూర్తి మద్దతు ఇస్తుంది. దీంతో వినియోగదారులు లాగ్-ఫ్రీ అనుభవాన్ని పొందుతారు. ఈ అద్భుతమైన ఫీచర్లతో కూడిన A80 స్మార్ట్‌ఫోన్ రూ. 6999 ధరతో అందుబాటులో ఉంటుంది. A80 50MP సూపర్ HDR కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్, తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలు తీసే సామర్థ్యం కలిగి ఉంది. వినూత్న రింగ్ లైట్ నోటిఫికేషన్, 6.67 అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లే వినియోగదారుడి అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. IP54 రేటింగ్తో A80 దుమ్ము, నీటిని నిరోధించడంలో ఉపయోపడుతుంది. ఇది Android 14 Go OS, Unisoc T603 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. జస్ట్ మీ రోజువారీ పనుల కోసం సున్నితమైన పనితీరు అందిస్తుంది. ఐటెల్ A80 కొనుగోలు చేసిన 100 రోజులలోపు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అందించబడుతుంది. ఇది సాండ్‌స్టోన్ బ్లాక్, గ్లేసియర్ వైట్, వేవ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది, ఇవి చక్కదనం మరియు ప్రాక్టికాలిటీని కలిపి ఆకట్టుకునేలా తయారయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu