దుబాయ్ వేదికగా జరగనున్న దుబాయ్ 24 అవర్స్ రేసింగ్ లో పాల్గొనడం కోసం కోలీవుడ్ హీరో అజిత్ వెళ్లారు. దుబాయ్ వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో బార్య శాలిని, కుమారుడు అద్విక్... ఇద్దరికీ అజిత్ సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ వెళ్లిన ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అందులో అజిత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో తెలియజేసింది. ''ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కారు మాసివ్ క్రాష్ అయింది. అయితే ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు. ఎటువంటి గాయాలు లేకుండా బయటకు నడుచుకుంటూ వచ్చారు. రేసింగ్ అంటే అంతే'' అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్ పేర్కొంది. ''రేసింగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియో బయటకు వచ్చింది. అజిత్ గారు సురక్షితంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని అజిత్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
0 Comments