Ad Code

ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ఏం చేయలేదు గానీ అద్దాల మేడ నిర్మించుకున్నారు : అమిత్ షా


ఢిల్లీలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారంలో భాగంగా నిన్న కేజ్రీవాల్ ను టార్గెట్‌ చేసుకొని ప్రధాని మోడీ ధ్వజమెత్తగా, ఈరోజు అమిత్ షా కూడా ఆప్ అధినేత లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక నివాసంపై దుబారా ఖర్చు చేశారంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఒక బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ''కొందరు పిల్లలు తనను కలవడానికి తన ఇంటికి వచ్చారని, వాళ్లను కేజ్రీవాల్ ఢిల్లీ కోసం ఏం చేశారని అడిగాను. దానికి  ఓ పిల్లవాడు శీష్‌మహల్ నిర్మించుకున్నారని చెప్పాడు.'' అని అమిత్ షా అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఏం చేయలేదు గానీ, అద్దాల మేడలాంటి రాజభవనం నిర్మించుకున్నారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ప్రభుత్వ కారు, బంగ్లా తీసుకోనని చెప్పిన ఆయన ఈరోజు ఢిల్లీ ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ లెక్క చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu