వృద్ధాప్యంలో కళ్ల కింద వలయాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కళ్ళ కింద వలయాలు వయసును మరింత పెంచేస్తాయి. ఇంట్లో పాటించే చిన్న చిన్న టిప్స్ తో వీటిని మాయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి రసంలో ఉప్పు కలిపి కళ్ళ కింద ఉన్న క్యారీ బ్యాగులకు పూసినట్లయితే వాపు తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పూసి మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడుక్కునట్లయితే ఉల్లిపాయల రసంలో ఉండే కెమికల్స్ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకు పోవడాన్ని ఆపుతాయి. అయితే వీటిని పూసుకునే సందర్భంలో కళ్ళకు తగలనీయకండి. అంతే కాదు వెల్లుల్లిని దంచి పేస్ట్ గా చేసి ఐ బ్యాగ్స్ పైన అప్లై చేసి, ఓ అరగంట పాటు ఉంచి చల్లటి నీళ్లతో కడుక్కుంటే మంచిది. ఇది కళ్ల క్రింద పైన పేరుకుపోయిన కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి కంటి కింద అప్లై చేస్తే ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించడం ద్వారా, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ విటమిన్ లను అధికంగా తీసుకోవడం ద్వారా కూడా కళ్ళ కింద క్యారీ బ్యాగులను తగ్గించవచ్చు. అధికంగా నీరు తాగడం ద్వారా కూడా కళ్ళ వాపులను, కళ్ళకింద నల్ల వలయాలను, క్యారీ బ్యాగులను తగ్గించుకోవచ్చు. కళ్లకు కోల్డ్ కంప్రెస్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కళ్ళలో వచ్చే ఈ ఫ్లూయిడ్ అసమతుల్యతలను తగ్గించుకోవచ్చు.
0 Comments