ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్‌లో 15మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా ఇవాళ ఉదయం జవాన్లు కుత్రు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. గతకొన్నాళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.
0 Comments