Ad Code

ఎనిమిది కులాల పేర్లలో మార్పులు : కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్


మాజంలో చులకనభావంతో చూస్తూ, తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లను మార్చాలంటూ వచ్చిన అభ్యర్థనలను బీసీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నది. తెలంగాణ జిల్లాల్లో బీసీ కమిషన్​చేపట్టిన పబ్లిక్ హియరింగ్​కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలు ఉన్నాయి. ఈ పేర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను కూడా ఆయా కులసంఘాల ప్రతినిధులు సూచించడంతో కులాల పేర్లను మారుస్తూ శనివారం బీసీ కమిషన్ ​నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చిన పేర్లపై ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం నుంచి ఈ నెల 18 వరకు ఖైరతాబాద్​లోని బీసీ కమిషన్ ఆఫీస్​లో సంప్రదించాలని బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయ దేవి నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu