Ad Code

చిరుత పులి పారిపోకుండా తోకను గట్టిగా పట్టుకున్న యువకుడు !


ర్ణాటక రాష్ట్రంలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుత గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. చిరుతని చూసిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోనులో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చిరుత తప్పించుకోవాలని చూసింది. ఈ తరుణంలో అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు చిరుత పులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అధికారులు వల సాయంతో చిరుతను బంధించారు. ఈ క్రమంలో చిరుతను బోనులో వేసి అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన ఆ యువకుడిని గ్రామస్థులు, అధికారులు అభినందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu