డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ ని రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. తాజాగా విడుదల అయిన డేటా ప్రకారం, 2024 డిసెంబర్లో స్విఫ్ట్‌ను దాదాపు 30,000 మంది కొన్నారు. ఒక్క నెలలో ఇన్ని సేల్స్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది మారుతీ కంపెనీ డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. దీనిపై మార్కెట్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం రూ.6.49 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ మాత్రం రూ.9.60 లక్షలకు లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ.8.20 లక్షల నుంచి మొదలవుతుంది. స్విఫ్ట్ కారు మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్ అలాగే, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో లభించడంతో పాటు మైలేజ్ కూడా బాగానే వస్తుంది. పెట్రోల్ మోడల్లో మాన్యువల్ గేర్‌బాక్స్‌లో 24.80 కి.మీల మైలేజ్ ఇస్తుంది, అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 25.75 కి.మీలు, చివరగా సీఎన్జీ ఆప్షన్లో 32.85 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. లోపల ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, -అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణంలో ఎంటర్టైన్ మెంట్ కోసం ఆర్కామిస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రధాన ఫీచర్లను అందించారు. అలాగే, లాంగ్ జర్నీ చేయడానికి ఎక్కువ సామాన్లు పెట్టడానికి 265 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.
నెల రోజుల్లో 30 వేల మారుతీ సుజుకీ స్విఫ్ట్ అమ్మకం !
by Telugu Lo Computer at January 04, 2025
Labels:
automobile
,
science
,
technology
,
ఐదు వేరియంట్లలో లభిస్తుంది
,
నెల రోజుల్లో 30 వేల మారుతీ సుజుకీ స్విఫ్ట్ అమ్మకం
,
మార్కెట్ వర్గాలు కూడా ఆశ్చర్యం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment