ఐరోపా కార్ల తయారీ దిగ్గజం 'ఫోక్స్ వ్యాగన్ గ్రూప్' ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందన్న వార్త ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. మొదట జర్మనీలో 50 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన ఈ సంస్థ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను ఏకంగా లక్షకు పెంచింది. ఈ సంక్షోభ ప్రభావం కేవలం ఫోక్స్ వ్యాగన్‌పైనే కాకుండా, దాని అనుబంధ లగ్జరీ బ్రాండ్ ‘ఆడీ’పై కూడా పడింది. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా జర్మనీలోని మూడు ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్లతో పాటు, ఒక ఆడీ ఫ్యాక్టరీని కూడా పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ భారీ లేఆఫ్స్ మరియు ఫ్యాక్టరీల మూసివేతకు అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న సమీకరణాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా విధించిన సుంకాలు మరియు చైనాకు చెందిన చౌకైన ఎలక్ట్రిక్ వాహన కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక ఫోక్స్ వ్యాగన్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి గ్రూప్ ఒక సంచలన వ్యూహాన్ని కూడా పరిశీలిస్తోంది. ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ నుండి ‘VW’ను పూర్తిగా వేరు చేసి, ఒక స్వతంత్ర బ్రాండ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
0 Comments