Ad Code

ఆస్తి వివరాలు వెల్లడించని ఉద్యోగులు : 68,000 మంది జీతాలను నిలిపివేసిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం


త్తరప్రదేశ్‌ లో  ఆస్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. జనవరి 31 గడువులోగా మానవ సంపద పోర్టల్‌లో చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమైన ప్రభుత్వ ఉద్యోగుల జనవరి నెల జీతాలు నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పనిసరిగా ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేసే వరకు జీతాల నిలిపివేత కొనసాగుతుందని చెప్పారు. ఈ నిబంధనలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ప్రభుత్వ డేటా ప్రకారం 34,926 గ్రూప్ సీ ఉద్యోగులు, 22,624 గ్రూప్ డీ సిబ్బంది, 7,204 గ్రూప్ బీ అధికారులు, 2,628 గ్రూప్ ఏ అధికారులు నిర్దేశిత సమయంలోగా తమ ఆస్తుల వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి ఎస్పీ గోయల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు గడువులోగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆయా ఉద్యోగులకు ఫిబ్రవరిలో కూడా జీతాలు అందుతాయన్న గ్యారెంటీ లేదన్నారు.

Post a Comment

0 Comments

Close Menu