Ad Code

మొహాలీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని విస్తరించిన ఇన్ఫోసిస్‌ !


న్ఫోసిస్‌ మొహాలీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని విస్తరించింది. 3,50,000 చ.అ. విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ని ప్రారంభించింది. ఇది సుమారు 3,000 మంది ఉద్యోగులకు సరిపోతుందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్‌ తదితర రంగాల్లో గ్లోబల్‌ క్లయింట్లకు ఏఐ ఆధారిత సొల్యూషన్స్, క్లౌడ్‌ సర్వీసులు అందించేందుకు ఇందులోని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ ఉపయోగపడుతుందని వివరించింది. కృత్రిమ మేధ సర్వీసులను పటిష్టం చేసుకోవాలన్న తమ వ్యూహంలో ఇదొక కీలక మైలురాయని ఇన్ఫీ సీఎఫ్‌వో జయేష్‌ సంఘ్‌రాజ్‌కా తెలిపారు. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రాంతీయంగా టెక్నాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర వృద్ధికి ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం మొహాలీ సెంటర్‌లో ఇన్ఫికి వెయ్యి  మంది ఉద్యోగులు ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu