శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు

శ్రీశైలంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి సాక్షిగణపతి ఆలయంలో అర్చకులు వేదపండితులు ఈఓ శ్రీనివాసరావు శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజలను ప్రారంభించారు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగనున్న నేపథ్యంలో మొదటిరోజు సాక్షిగణపతి ఆలయం పూజలలో ఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామివారి యాగశాల ప్రవేశంతో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలకు అర్చకులు వేదపండితులు అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గణపతి నవరాత్రులకు వైభవంగా శ్రీకారం చుట్టారు ఆలయంలో మృతికా గణపతికి రత్నగర్భ గణపతిస్వామికి శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతిస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారూ అయితే ఉత్సవ సమయంలో ప్రతిరోజు గణపతిహోమం,రుద్రహోమం రత్నగర్భగణపతి సాక్షిగణపతికి పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం