మణుగూరులో 20 KW పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్‌ ప్రారంభం

తెలంగాణాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో 20 kW పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించింది. భూగర్భ ఉష్ణ శక్తి అంటే భూమి నుండి వెలువడే వేడి శక్తి. అదే జియో థర్మల్. భూగర్భ ఉష్ణ సాంకేతికత ద్వారా భూమి ఉపరితలం లోపల ఉన్న వేడిని వెలికి తీసి దీనిని నేరుగా విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ పైలట్ ప్లాంట్ క్లోజ్డ్-లూప్ బైనరీ ఆర్గానిక్ రాంకిన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని ద్వారా విద్యుత్ ను తయారు చేయనున్నారు. దేశంలోనే ఈ సాంకేతికతను ఉపయోగించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా ఉంది.మణుగూరు ప్రాంతంలో బొగ్గు నిల్వల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో సుమారు వెయ్యి మీటర్ల లోతులో వేడినీటి వనరులు ఉన్నాయని గుర్తించారు. ఈ వేడినీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేయటానికి 20 KW పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 381 ఉష్ణ అసాధారణ ప్రాంతాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించి, సుమారు 10,600 మెగావాట్ల భూఉష్ణ విద్యుత్ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ "జియోథర్మల్ అట్లాస్ ఆఫ్ ఇండియా, 2022"ను ప్రచురించింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం