Posts

Showing posts with the label excellent opportunity for those wishing to start a business

నిరుద్యోగులకు పోస్టాఫీస్ ద్వారా ఆథరైజ్డ్ ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌

Image
ఇం డియా పోస్ట్ కొన్ని ప్రదేశాలలో పోస్టల్ సేవలను అందించడానికి ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రాంచైజ్ ద్వారా కొన్ని పోస్టల్ సేవలను కస్టమర్లకు అందించవచ్చు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్, పోస్టల్ ఏజెంట్. పోస్టల్ ఏజెంట్లు ఎక్కువగా స్టాంపులు, స్టేషనరీ వస్తువులను విక్రయిస్తారు. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ విషయానికొస్తే ఇండియా పోస్ట్‌తో ఒక ఒప్పందం చేసుకుని ఆథరైజ్డ్ ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌ తెరవొచ్చు. దీని వల్ల ఆదాయం సంపాదించుకోవచ్చు. వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. డెలివరీ చేసే ప్రతీ పోస్ట్‌పై కమిషన్ అందుతుంది. దీనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి అనేది లేదు. దీంతో పెద్ద వయస్సువారు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. పోస్టల్ ఉద్యోగుల కుటుంబసభ్యులు దీనికి  అనర్హులు. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ కస్టమర్‌లకు సులభంగా అందుబాటులో ఉండాలి. దీనికి  అనుకూలమైన షాప్ లేదా కౌంటర్ స్పేస్ ఉండాలి. అది సొంత ప్రాపర్టీ అయినా లేదా అద్దెకు తీసుకున్న ప...