Posts

Showing posts with the label Supreme Court Directs Submission of Writ Petition Copies to Solicitor General

నీట్ పేపర్ లీక్ : రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్‌కు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం

Image
నీట్ యూజీ పరీక్ష  పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో గతంలో తలెత్తిన వివాదాల సందర్భంగా సిఫార్సు చేసిన సంస్కరణల అమలుపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సూటి ప్రశ్నలు వేసింది. ఈ మేరకు నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే వారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల కాపీలను సొలిసిటర్ జనరల్‌కు సమర్పించాలని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్ పై దాఖలైన పిటిషన్లపై విచారణలో పిటిషనర్ల తరఫున హాజరైన లాయర్ తన్వి దూబే.. ఈ కేసు ప్రాధాన్యతను సుప్రీంకోర్టుకు గుర్తుచేశారు. వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షకు సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇది వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆమె కోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ పిటిషన్ పై విచారణ త్వరితగతిన చేపట్టాలని, విచారణకు త్వరగా తేదీని కేటాయించాలని దూబే కోర్టును కోరారు. అయితే కోర్టు ప్రస్తుత వివాదానికి మించి, పరీక్షా ప్రక్రియలకు సంబంధించిన గత ఆందోళనల తర్వాత ప్రవేశపెట్టిన గత సంస్కరణ చర్యల అమలుపై దృష్టి సారించింది. ఈ మేరకు వారు గుణపాఠాలు నేర్చుక...