Posts

Showing posts with the label Southwest Monsoon Withdrawal

నైరుతి రుతుపవనాల తిరోగమనం : ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు : ఐఎండీ అంచనా

Image
నా లుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు విస్తారంగా వర్షాలు కురిపించింది. మలికిపురంలో గరిష్టంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఈ నెల 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌ నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కానుందని ఐఎంజీ ప్రకటించింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న రుతుపవన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అంచనాల కంటే ఆలస్యంగా జూన్ 4న కేరళలోకి ప్రవే...