Posts

Showing posts with the label Union Minister Kishan Reddy Inspects Arrangements

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం : ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Image
సి కింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న 'తెలంగాణ విమోచన దినోత్సవ' ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించారు. అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గానీ మజ్లిస్ పార్టీకి భయపడి ఈ చారిత్రక దినోత్సవాన్ని నిర్వహించకుండా తప్పించుకున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముందుకు రాకపోవడంతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.