బడ్జెట్ సెగ్మెంట్‌లో గాలక్సీ A08 విడుదల
బ డ్జెట్ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ గాలక్సీ A08ను 4జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గతేడాది విడుదలైన గాలక్సీ A07కు కొనసాగింపుగా A సిరీస్‌లో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పెద్ద డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 25W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో దీనిని బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-యూ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం MediaTek Helio G99 6nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 4GB LPDDR4X RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రోSD కార్డ్ ద్వారా ఏకంగా 2TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఆరు తరాల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శామ్‌సంగ్ ప్రకటించింది. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అందించారు. ప్రధాన కెమెరాకు f/1.8 అపర్చర్, డెప్త్ సెన్సార్‌కు f/2.4 అపర్చర్ ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. డిస్‌ప్లే నాచ్‌లో 8MP...