Posts

Showing posts with the label Eliminedu

తెలంగాణలో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకంలో భాగంగా నాలుగు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు

Image
తె లంగాణలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకంలో భాగంగా రాష్ట్రంలో నాలుగు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కుల పురోగతిపైన ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మొదటి విడత కింద హైదరాబాద్ శివారు కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారం ప్రాంతాలలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నాలుగు ఇండస్ట్రియల్ పార్కులకు సమగ్ర డి పి ఆర్ ని తయారుచేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది అని సంజయ్ జాజు వెల్లడించారు. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో మరో 16 ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సత్వరమే సిద్ధం చెయ్యాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగ...