17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు : కూచ్ బీహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా

టీఎంసీ నుంచి బయటకు వచ్చిన 17 మంది రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూచ్ బీహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా అన్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై తిగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు నేషనలిస్టు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో 17 మంది బీజేపీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ జగదీశ్ అన్నారు. 'మాలో 17 మంది ఎంపీలో బీజేపీలో చేరనున్నారు. మొత్తం ఎంపీల్లో ఈ సంఖ్య మూడింట రెండువంతులు కాబట్టి మాకు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు' అని చెప్పారు. ఈ పరిణామాలకు బీజేపీ దూరంగా జరిగే ప్రయత్నం చేసింది. పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ కేవలం పార్టీలో చేరతామంటూ వచ్చిన ప్రతి ఒక్కరినీ తాము చేర్చుకోమనిచెప్పారు. ఎంపీ జగదీశ్ కామెంట్స్‌పై మరో రెబల్ ఎంపీ శతాబ్దీ రాయ్ కూడా ఆచితూచి స్పందించారు. అవి జగదీశ్ వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మరో ఎంపీ అబూతాహిర్ ఖాన్ మాత్రం ఘాటుగా స్పందించారు. తమ తరఫున మాట్లాడే హక్కు ఆయనకు లేదని తేల్చి చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీలు బయటనుంచే బీజేపీకి మద్దతు ఇస్తారన్న జగదీశ్ వ్యాఖ్యలను కూడా తాహిర్ ఖండించారు. 'మేము బీజేపీలోకి గానీ ఎన్‌డీఏలో గానీ చేరము. ఇది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను' అని అన్నారు. అయితే, ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటామని చెప్పారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం