నేతన్నభరోసా కోసం నేత కార్మికులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ అందజేయాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్ లో నేతన్నభరోసా కోసం దరఖాస్తు చేసుకునే నేత కార్మికులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ అందజేయాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 16 వరకు నూతన పెన్షన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు నేత కార్మికులకు ఉపయుక్తంగా మారింది. బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధన చేనేత కార్మికులకు పెద్ద అడ్డంకిగా మారిన క్రమంలో మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చాలా మందికి వ్యక్తిగతంగా వేతనాలు చెల్లిస్తుండటం వల్ల బ్యాంకు స్టేట్‌మెంట్ సమకూర్చుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యను చేనేత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా. మంత్రి సవిత వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో నిబంధనను సడలించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్‌లు అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులకు బ్యాంకు స్టేట్‌మెంట్‌లు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మందికి పైగా నేతన్నలకు నెలకు రూ.4 వేలు చొప్పున పెన్షన్ అందజేస్తున్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు నేతన్నల సేవలో పథకం కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం