భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారు : 30 శాతం కమిషన్ కోసమే కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు : కేటీఆర్
తె లంగాణాలో భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండపడ్డారు. 22A అవకతవకలపై జ్యూడీషియల్ ఎంక్వయిరీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతూ అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మూడేళ్లపాటు సెటిల్‌మెంట్లు చేసుకొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. 30 శాతం కమిషన్లు తీసుకున్న తర్వాత నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతిపై తమ పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. యూనిఫాం అని చెప్పి కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలోనే చట్టం తీసుకువస్తామనడంలో సహితుకత లేదని అభిప్రాయపడ్డారు. 22A భూముల అంశంపై బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ జవాబు చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఇంటిపైకి వేల మంది గుండాలను కాంగ్రెస్ పార్టీ పంపిందని అన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసానికి వెళ్తుంటే మమ్మల్ని ...