Posts

Showing posts with the label Strategic Partnership Between Reliance Jio and Canva

రిలయన్స్ జియో, కాన్వా వ్యూహాత్మక భాగస్వామ్యం

Image
రి లయన్స్ జియో, కాన్వా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది జియో వినియోగదారులకు కాన్వా ప్రీమియం సృజనాత్మక సాధనాలను ఉచితంగా అందించనున్నారు. రూ.4,000 వరకు విలువైన ఈ ప్రయోజనాన్ని అర్హులైన జియో కస్టమర్లు గరిష్ఠంగా 12 నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16, 2026 నుంచి అర్హత ఉన్న రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసే వినియోగదారులకు అన్ని ఛానళ్లలో అందుబాటులోకి రానుంది. జియో రీఛార్జ్ ప్లాన్ ఆధారంగానే క్యాన్వాలో లభించే ప్రయోజనం నిర్ణయమవుతుంది. రూ.399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసే అర్హులైన వినియోగదారులకు Canva Pro లభిస్తుంది. రూ.349 ప్లాన్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా అందించే రూ.349 కంటే ఎక్కువ ప్లాన్లను తీసుకునేవారికి Canva Pro Lite అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు MyJio యాప్‌లోకి వెళ్లి, కనిపించే ఆఫర్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అదనపు ఖర్చులు, దాచిన ఛార్జీలు ఉండవని సంస్థలు తెలిపాయి. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారాలు తమ ఫోన్ నుంచే ప్రొఫెషనల్ స్థాయి కంటెంట్...