సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు : ఆగస్టులో 4.82 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
దే శంలో పప్పులు, కూరగాయలు సహా ఇతర ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. జూలైలో 4.45 శాతంగా ఉన్న దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.82 శాతానికి చేరింది. కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ను విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది. ఆహార పదార్థాల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణాలయ్యాయి. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా లెక్కించే ఆహార ద్రవ్యోల్బణం జూలై 5.52 శాతం నుండి ఆగస్టులో 5.95 శాతానికి ఎగబాకింది. నిత్యం వాడే ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ద్రవ్యోల్బణం ఏకంగా 48.27 శాతానికి చేరింది. వెల్లుల్లి.. 43.60 శాతంగా నమోదైంది. అల్లం రేట్లల్లో కూడా 73.82 శాతం మేర పెరుగుదల కనిపించింది. కొన్ని కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే టమాటా ధరలు 31.09 శాతం తగ్గాయి. బంగాళాదుంప ధరలలో కూడా 13.14 శాతం తగ్గుదల నమోదైంది. వీటితో పాటు బెండకాయల ధరలు కూడా 5.41 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ కాలంలో వెండి ఆభరణాల ధరలు విపరీతంగా పెరిగి 107.11 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయ...