Posts

Showing posts with the label Osama bin Laden Planned Attacks in India

భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్ : సీఐఏ సంచలన నివేదిక

Image
అ మెరికాపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయానక ఉగ్ర దాడులకు కొన్ని సంవత్సరాల ముందే, అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ భారతదేశంలో కూడా దాడులు చేయడానికి ప్రణాళికలు రచించినట్లు వెల్లడైంది. 1998 నాటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గీకరించని నివేదిక ద్వారా ఈ సంచలన విషయం బయటపడింది. 9/11 దాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్‌లకు సమర్పించిన వంద కంటే ఎక్కువ పేజీల రహస్య నివేదికలను సీఐఏ బయటపెట్టింది. ఆగస్టు 28, 1998 నాటి ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్‌కు ‘బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఎ థ్రెట్’ అని పేరు పెట్టారు. అందులో లాడెన్ దాడులు చేయాలని భావించిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఈజిప్ట్, అరేబియా ద్వీపకల్పం (ముఖ్యంగా కువైట్, సౌదీ అరేబియా, యెమెన్), భారత్, పాకిస్థాన్, ఉగాండా, నైజీరియాలలో దాడులకు లాడెన్ ప్లాన్ చేశాడు. అయితే, ఈ పత్రంలో భారతదేశంలోని టార్గెట్ ప్లేస్, దాడికి కరెక్ట్ తేదీ లేదా ఆపరేషనల్ ప్లాన్ వివరాలు మాత్రం పేర్కొనలేదు. అలాగే ఈ సమాచారానికి ఆధారమైన ఇంటెలిజెన్స్ సోర్స్‌ను కూడా గోప్యంగా ఉంచారు. సు...