Posts

Showing posts with the label Johnson & Johnson to Pay $5.5 Billion in Compensation to Victims

బేబీ పౌడర్‌తో క్యాన్సర్ ఆరోపణలు : బాధితులకు $5.5 బిలియన్ పరిహారం చెల్లించనున్న జాన్సన్ & జాన్సన్

Image
ప్ర పంచ ప్రఖ్యాత ఔషధ, వినియోగదారుల ఉత్పత్తుల తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్‌కు సంబంధించిన వేలాది క్యాన్సర్ కేసుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. తమ టాల్క్ ఉత్పత్తులను దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల అండాశయ  క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ దాఖలైన దాదాపు 69,000 కేసుల పరిష్కారం కోసం కంపెనీ 5.5 బిలియన్ డాలర్లు(రూ.52,663 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. టాల్క్ బేబీ పౌడర్‌కు సంబంధించిన వివాదంలో ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పరిణామాల్లో ఒకటిగా భావిస్తున్నారు. గత దాదాపు 15 ఏళ్లుగా జాన్సన్ & జాన్సన్ టాల్క్ ఉత్పత్తులపై అమెరికాలో భారీ స్థాయిలో న్యాయపోరాటం కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలు, కంపెనీ తయారు చేసిన టాల్క్ ఆధారిత బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తులను సంవత్సరాల తరబడి ఉపయోగించడం వల్ల తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయించారు. ఈ ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉండొచ్చని, లేదా టాల్క్ వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వారు వాదించారు. అయితే ఈ ఆరోపణలను జాన్సన్ & జాన్సన్ ఎప్పటి నుంచో ఖండిస్తోంది. తమ టాల్క్ ఉత్పత్తులు పూర్తిగా స...