Posts

Showing posts with the label past two days has further heightened interest

అర్జెంటీనాలో రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం !

Image
రాత్రి వేళ సముద్రపు నీరు భారీగా వెనక్కి వెళ్లడం, మళ్లీ కొంతసేపటికి ముందుకు రావడం వరుసగా జరుగుతోంది. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 23 కిలోమీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. నీటిలో కప్పబడి ఉండే ప్రాంతాలు ఒక్కసారిగా బయటపడటంతో అక్కడి దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 'కంటికి కనిపించేది అంతా నిజం కాదు' అన్నట్టుగా.. సముద్రం వెనక్కి వెళ్లిన సమయంలో సాధారణంగా నీటిలో కనిపించని ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రపు అడుగుభాగం, నీటితో కప్పబడి ఉండే నిర్మాణాలు, తీర ప్రాంతంలోని ఇతర ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. దీంతో అసలు సముద్రం ఎందుకు ఇంత దూరం వెనక్కి వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా సముద్రం ముందుకు వెనక్కి కదలడం సహజమే. చంద్రుడి గురుత్వాకర్షణ, సూర్యుడి ప్రభావం, గాలుల వేగం, సముద్ర ప్రవాహాలు, స్థానిక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆటుపోట్ల సమయంలో సముద్రం గణనీయంగా వెనక్కి వెళ్లినట్లు కనిపించవచ్చు. అయితే అర్జెంటీనాలో నమోదవుతున్న ఈ స్థాయి మార్పు మాత్రం సాధ...