Posts

Showing posts with the label Worms in Protein Powder

ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు : నటి బిపాసా బసు సోషల్ మీడియా వేదికగా ఆందోళన

Image
బా లీవుడ్ నటి బిపాసా బసు ఆహార భద్రతకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కొత్తగా కొనుగోలు చేసిన ఒక ప్రముఖ బ్రాండ్ ('ఐసోప్యూర్') ప్రోటీన్ పౌడర్ డబ్బాను తెరవగా అందులో చిన్న చిన్న పురుగులు కనిపించాయని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న బిపాసా బసు, వేలిపై ఉన్న పురుగును చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. "కొత్తగా విప్పిన ఈ ప్రోటీన్ పౌడర్ డబ్బా నిండా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి" అని చెబుతూ, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండేని ట్యాగ్ చేశారు. వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యమైన ఆహార పదార్థాలు అందాలంటే మీరే మాకు ఏకైక ఆశ. దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి అని బిపాసా బసు ప్రభుత్వ అధికారులను కోరారు.