Posts

Showing posts with the label Samsung Galaxy A55 users

అందుబాటులోకి వచ్చిన వన్ UI 9 బీటా అప్‌డేట్‌

Image
దే శంలో ఈరోజు నుంచి వన్ UI 9 బీటా అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది. మొదటి బిల్డ్‌తో పాటు సెప్టెంబర్ 2026 సెక్యూరిటీ ప్యాచ్‌ను అందించారు. ఈ అప్‌డేట్ సైజు దాదాపు 2.1GB ఉంటుంది. శామ్‌సంగ్ మెంబర్స్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే, ఓవర్ ది ఎయిర్ పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌కే పరిమితం కాకుండా ఈసారి మిడ్‌-రేంజ్ ఫోన్లకు కూడా బీటా రోలౌట్‌ను విస్తరించడం విశేషం. ఈ బీటా ప్రోగ్రామ్‌లో చేరే ముందు మీ ఫోన్ డేటానంతా బ్యాకప్ చేసుకోవడం మంచిది. బీటా వర్షన్ సాఫ్ట్‌వేర్లలో కొన్ని రకాల లోపాలు ఉండే ప్రమాదం ఉంది. ప్లే ఇంటిగ్రిటీ చెక్స్ వైఫల్యం వల్ల కొన్ని బ్యాంకింగ్, UPI యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. బీటా వెర్షన్లలో 'ట్యాప్ టు పే' ఫీచర్ సరిగ్గా పనిచేయకపోవచ్చని గూగుల్ స్వయంగా హెచ్చరిస్తోంది. ఒకవేళ మీరు మళ్లీ పాత వెర్షన్‌కు మారాలనుకుంటే, శామ్‌సంగ్ మెంబర్స్‌లో విత్‌డ్రా అయిన తర్వాత పిసిలో స్మార్ట్ స్విచ్ యాప్ వాడాల్సి ఉంటుంది.మొదట Samsung Members యాప్ తెరవండి. హోమ్‌పేజీలో కనిపించే One UI 9 Beta బ్యానర్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. నిబంధనలను అంగీకరించి సబ్మిట్ చేయండి. ఆ...