Posts

Showing posts with the label Gudihatnoor

అత్తపై కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన అల్లుడు !

Image
తె లంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ​కుటుంబ కలహాల నేపథ్యంలో కోపోద్రిక్తుడైన అల్లుడు, అత్త ఇంటిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇదే గ్రామానికి చెందిన కడమంచి రాజమణి చిన్న కుమార్తెతో ఆమె అల్లుడు ప్రసాద్ అలియాస్ అరుణ్ తరచూ మద్యం తాగి గొడవపడేవాడు. ఈ నెల 8వ తేదీన అతడు మద్యం మత్తులో భార్యను, అత్తను చంపేస్తానని బెదిరించడంతో ప్రాణభయంతో వారు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అత్తపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్న అల్లుడు, శనివారం రాత్రి వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇల్లు తగలబడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలికి సమాచారం అందించారు. బాధితులు హుటాహుటిన స్వగ్రామానికి చేరుకునేసరికి ఇల్లంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, బీరువా, కూలర్, వంట సామగ్రితో పాటు అరతులం బంగారు పుస్తెల తాడు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గుడిహత్నూర్ ఎస్సై ఎల్ శ్రీకాంత్ తెలిపారు.