Posts

Showing posts with the label Gajapathinagaram constituency

ఆటో ఢీకొట్టిన లారీ : ముగ్గురు మృతి

Image
ఆం ధ్రప్రదేశ్ లోని, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం, దత్తి రాజేరు మండలం షికారుగంజి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం 5:15 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురం వైపు నుండి రాంభద్రపురం వెళ్తున్న ఆటోను, ఎదురుగా రాంభద్రపురం వైపు నుండి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బూర్జి వలస పోలీసులు మరియు బొబ్బిలి డి.ఎస్.పి సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తును కొనసాగిస్తూ మృతదేహాలను గజపతినగరం ప్రాంత ఆసుపత్రికి తరలించారు.