అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
అ క్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ప్లస్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఇక యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని కూడా ఈ లీక్స్ ద్వారా తెలుస్తోంది. ₹12,000 లోపు బడ్జెట్‌లో పోకో సి75 5జీ, మోటో జీ34 5జీ ఫోన్లు మంచి ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. పోకో C75లో 120Hz డిస్‌ప్లే, క్వాల్‌కమ్ ఎంట్రీ-లెవెల్ 5జీ ప్రాసెసర్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లకు ముందే ఇది దాదాపు ₹11,000 ధరకు లభిస్తోంది. ఇక మోటో G34లోని స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ BGMI వంటి గేమింగ్‌కు కూడా స్మూత్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా మోటోరోలా భారత్‌లో ఈ ఫోన్‌కు అప్పుడే ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది.₹12,000 నుంచి ₹15,000 బడ్జెట్ విభాగంలో రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 120Hz FHD+ స్క్రీన్, 45W ఫాస్ట్ ఛార్జింగ్, n77/n78 5జీ బ్యాండ్ల సపోర్ట్‌తో వస్తోంది. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) స్పీడ్ విషయంలో కొద్దిగా వెనుకబడినా, భారీ 6000mAh బ్యాటరీ...