Posts

నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

Image
త మిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి సమీపంలోని మండీ కృష్ణాపురంలో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మండీ కృష్ణాపురంలో ‘చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా’కి చెందిన నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవన పైకప్పుపై కాంక్రీట్ వేస్తున్న సమయంలో, సుమారు 20 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టీల్ స్కాఫోల్డింగ్, సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్ బరువును తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కాంక్రీట్ స్లాబ్‌తో పాటు పైన పనిచేస్తున్న కార్మికులు భారీ శిథిలాలు, ఇటుకలు, రాళ్ల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 11 మంది కార్మికులను అంబులెన్సుల్లో వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రులకు తరలించారు. మరికొందరిని పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉం...

నేతన్నభరోసా కోసం నేత కార్మికులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ అందజేయాల్సిన అవసరం లేదు

Image
ఆం ధ్రప్రదేశ్ లో నేతన్నభరోసా కోసం దరఖాస్తు చేసుకునే నేత కార్మికులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ అందజేయాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 16 వరకు నూతన పెన్షన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు నేత కార్మికులకు ఉపయుక్తంగా మారింది. బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధన చేనేత కార్మికులకు పెద్ద అడ్డంకిగా మారిన క్రమంలో మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చాలా మందికి వ్యక్తిగతంగా వేతనాలు చెల్లిస్తుండటం వల్ల బ్యాంకు స్టేట్‌మెంట్ సమకూర్చుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యను చేనేత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా. మంత్రి సవిత వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో నిబంధనను సడలించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్‌లు అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులకు బ్యాంకు స్టేట్‌మెంట్‌లు లేకున్నా...

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నరేంద్ర మోడీ, వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్ ఫోటో

Image
న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి ఉన్న  ఫోటో వైరల్‌గా మారింది. మోడీ మధ్యలో నిలబడగా, ఇరు వైపుల పుతిన్, జిన్‌పింగ్ మోడీ చేతులు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు నేతలు సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుతున్న ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫోటో వెస్ట్రన్ దేశాలకు ఒక పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత, ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్న వేళ ప్రపంచంలో శక్తివంతమైన దేశాధినేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రష్యా, చైనాలతో భారత్ తన సంబంధాలను బలోపేతం చేసుకుంటుండగా, మరోవైపు యూరప్, అమెరికాలతో దోస్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ సన్నివేశం ప్రత్యేకంగా మారింది. అంతకుముందు, ప్రధాని మోడీ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ.. వెస్ట్రన్ దేశాలకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కొన్ని దేశాల నిర్ణయాలను గ్లోబల్ సౌత్ దేశాలు పాటించడం ఇకపై కుదరదని, ప్రప...

విజయవాడలో వర్ష బీభత్సం : దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత, పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తం

Image
వి జయవాడ నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం మూడు గంటల వ్యవధిలోనే పడిన కుండపోత వర్షానికి బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. అకస్మాత్తుగా ముంచెత్తిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ఈ నీటిలో ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుని పూర్తిగా మునిగిపోవడం వర్షం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో పాటు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భద్రతా చర్యల్లో భాగంగా దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు గంటల తరబడి నానా తంటాలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయని లోతట్టు కాలనీల్లోకి వర్...

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వార్తలను ఖండించిన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్

Image
ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడేకు పెజిష్కియాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వార్తలను ఆయన ఖండించారు. మోజ్తాబా ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పాడు. 2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా.. ఆయన కుటుంబ సభ్యులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయతొల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడుల తర్వాత ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. చివరకు ఆయన తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. దీంతో మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొనడంతో అతడి మరణ వార్తల పుకార్లకు తెరపడింది.

ఈ ఏడాది సదస్సు ఒక చారిత్రక మైలురాయి : బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

Image
ఢి ల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ ఏడాది సదస్సు ఒక చారిత్రక మైలురాయి అని, బ్రిక్స్ కూటమి ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇది సరికొత్త బాధ్యతలకు నాంది పలుకుతుందని మోడీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకోవడంలో గ్లోబల్ సౌత్ ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై గ్లోబల్ సౌత్ కేవలం ఇతరుల నిబంధనలు పాటించే స్థాయి నుంచి, నిబంధనలు రూపొందించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికోసం వచ్చే బ్రిక్స్ సదస్సు నాటికి ఒక ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని, 10 గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలను వెంటనే అమలు చేయాలని మోడీ తన ప్రసంగంలో ప్రతిపాదించారు.

ఆల్-టైమ్ గరిష్టానికి చేరిన భారత విదేశీ మారక నిల్వలు : రష్యాను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్

Image
ఆ ర్బీఐ చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం రికార్డు స్థాయిలో పెరగడంతో విదేశీ మారక నిల్వలు ఆల్-టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది. ‘బ్లూమ్‌బర్గ్’ డేటా ప్రకారం సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 44.9 బిలియన్ డాలర్లు పెరిగి 785.7 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. ఈ భారీ పెరుగుదలతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది జూన్ 8న ప్రవేశపెట్టిన ఫారెన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్ల స్పెషల్ స్వాప్ పథకానికి అనూహ్య స్పందన లభించడమే ఈ డాలర్ల వరదకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పథకం ద్వారా కేవలం 11 వారాల్లోనే దేశంలోకి 73 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. నిర్దేశిత లక్ష్యం గడువు కంటే ముందే నెరవేరడంతో, ఆర్బీఐ ఈ పథకాన్ని సెప్టెంబర్ 30కి బదులుగా ఆగస్టు 31నే ముగించింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశ పసిడి నిల్వల విలువ...