Posts

Showing posts with the label Iranian President Pezeshkian Arrives in New Delhi

న్యూఢిల్లీకి చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

Image
ఇ రాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య చర్చలు ప్రధానంగా చాబహార్ ఓడరేవు, ప్రాంతీయ కనెక్టివిటీ, వాణిజ్యం భారత్-ఇరాన్ ఆర్థిక సంబంధాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇరు దేశాలు తమ ఆర్థిక దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న తరుణంలో పెజెష్కియన్ పర్యటన జరుగుతోంది. బ్రిక్స్ షాంఘై సహకార సంస్థ వంటి బహుపాక్షిక వేదికల ద్వారా ప్రాంతీయ ప్రపంచ అంశాలపై భారత్, ఇరాన్ సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఈ సదస్సులో భాగంగా భారత ప్రధాన మంత్రి మోడీ, పెజెష్కియన్ ఉన్నత స్థాయి సమావేశాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే తజికిస్థాన్ లోనిర్వహించిన ఎస్సీఓ సదస్సులో, ఈ ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఇరాన్‌తో వాణిజ్యాన్ని విస్తరించడంపై భారత్‌కు ఉన్న ఆసక్తిని మోదీ వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో శాంతి స్థిరత్వానికి భారత్ మద్దతు ఇస్తుందని ఈ సందర్బంగా మోదీ కీలక ప్రకటన చేయడం విశేషం. భారత్‌తో సంబ...